|
|
by Suryaa Desk | Wed, Feb 18, 2026, 12:50 PM
రజినీకాంత్ హీరోగా నటించిన మూవీ కొచ్చాడయాన్. 2014లో విడుదలైన ఈ యాక్షన్ - అడ్వెంచర్ మూవీ బాక్సాఫీస్ వద్ద అభిమానులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. బాలీవుడ్ భామ దీపికా పదుకొణె ఇందులో హీరోయిన్‌గా కనిపించింది. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లో విస్తృత చర్చకు దారి తీసింది. విజువల్స్ కార్టూన్ సినిమాను తలపిస్తున్నాయంటూ ప్రేక్షకుల నుంచి విమర్శలు, ట్రోల్స్ కూడా ఎదురయ్యాయి. అయితే తాజాగా ఈ మూవీకి సరికొత్త హంగులతో టీజర్ విడుదలైంది. ఏఐ సాయంతో రూపొందించిన ఈ టీజర్ తలైవా అభిమానులను ఆకట్టుకుంటోంది. అంతేకాదు, మొత్తం సినిమాన్నే ఏఐ టెక్నాలజీతో రీ - జనరేట్ చేసే ప్రయత్నాలు సాగుతున్నట్లు సమాచారం.
Latest News