|
|
by Suryaa Desk | Fri, Feb 20, 2026, 09:31 PM
సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం కపుల్ ఫ్రెండ్లీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రమోషన్ల భాగంగా చిత్ర బృందం ప్రభాస్ తో ఒక ఇంటర్వ్యూ కూడా నిర్వహించింది.ఈ సందర్భంలో సంతోష్, మానస వారణాసి ప్రభాస్ తో సరదాగా ముచ్చట్లు పెట్టారు. తమకు ఇష్టమైన సినిమాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. సంతోష్ అన్నారు, ప్రభాస్ నటించిన ‘ఏక్ నిరంజన్’ ఆయన ఫేవరేట్ సినిమా, అందులో చింటూ క్యారెక్టర్ మోస్ట్ అండర్‌రేటెడ్ జెమ్ అని. అప్పుడు ప్రభాస్ డైలాగ్ డెలివరీ చాలా అద్భుతంగా ఉందని కూడా పేర్కొన్నారు.
*దానికి స్పందిస్తూ ప్రభాస్ చెప్పారు:“‘ఏక్ నిరంజన్’ గురించి అడుగుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. పూరి జగన్నాథ్ లా డైలాగులు రాయగలవాడు ప్రపంచంలో ఎవరూ లేరు. ఆయన నాకు బుజ్జిగాడు క్యారెక్టర్ చెప్పినప్పుడు నిజంగా పిచ్చెక్కిపోయా, ‘నేను ఇలా చేయలేను’ అని టెన్షన్ పెరిగిపోయింది. ఆయన రాసిన డైలాగ్స్ నాకు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించాయి. బుజ్జిగాడు క్యారెక్టర్ కోసం నేను సూపర్ ఎగ్జైటెడ్ అయ్యాను. పూరీ గారిలా రైటింగ్, క్యారెక్టర్ డిజైనింగ్ చేసేవారు ఇండియాలో మాత్రమే కాదు, ప్రపంచంలో ఎవరూ లేరు.”కాగా ప్రభాస్ – పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో ‘బుజ్జిగాడు’, ‘ఏక్ నిరంజన్’ లు వచ్చాయి. ఇందులో బుజ్జిగాడు సూపర్ హిట్ కాగా ఏక్ నిరంజన్ మాత్రం ఫ్లాప్ అయ్యింద. అయితే రిజల్ట్ తో సంబంధం లేకుండా ఈ రెండు లను తన కెరీర్ లో ప్రత్యేకంగా భావిస్తాడు ప్రభాస్. ఈ విషయాన్ని పలు సందర్బాల్లో చెప్పుకొచ్చాడు ప్రభాస్. పూరీపై ప్రశంసలు కురిపించాడు. ఇక ది రాజా సాబ్ తర్వాత ఫౌజీ షూటింగులో పాల్గొంటున్నాడు డార్లింగ్. హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో కొత్త అమ్మాయి ఇమాన్వీ హీరోయిన్ గా నటిస్తోంది. దీనితో పాటు సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ లోనూ యాక్ట్ చేస్తున్నాడు ప్రభాస్. అలాగే సలార్ 2, కల్కి 2 లను కూడా ప్రభాస్ పూర్తి చేయాల్సి ఉంది.