|
|
by Suryaa Desk | Wed, Feb 18, 2026, 12:33 PM
పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ తన నటనతో అభిమానులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం 'డ్రాగన్' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న ఈ హీరో, ఇటీవల ఒక మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫేవరెట్ స్నాక్ గురించి వెల్లడించారు. హైదరాబాద్ బిర్యానీతో పాటు, సాయంత్రం పూట పునుగులు తినడం అంటే తనకు చాలా ఇష్టమని, ముఖ్యంగా అల్లం, పల్లీల చట్నీతో తింటే ఆ రుచి అద్భుతంగా ఉంటుందని తెలిపారు. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక ఇది చూసిన వారందరూ.. హైదరాబాద్ బిర్యానీ మాత్రమే కాకుండా, పునుగులు కూడా చాలా ఫేమస్.. నిజంగా వీటి టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Latest News