|
|
by Suryaa Desk | Thu, Feb 19, 2026, 05:29 PM
‘బాహుబలి’ చిత్రంలో భల్లాలదేవ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రానా దగ్గుబాటి, ఆ సినిమా కోసం తన శారీరక రూపాన్ని పూర్తిగా మార్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత తన జీవితంలో జరిగిన అనూహ్య పరిణామాల గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన భావోద్వేగంగా మాట్లాడారు. అన్నింటికంటే ఆరోగ్యం ముఖ్యమని నాకు ఆ సమయంలోనే తెలిసిందని పేర్కొన్నారు. తనకు తీవ్రమైన ఆరోగ్య సమస్య ఉందని తెలిసినప్పుడు నిజంగా షాక్ అయ్యానని రానా పేర్కొన్నారు. సర్జరీ కోసం అమెరికాకు వెళ్లాల్సి వచ్చిందని, కుటుంబాన్ని విడిచి కొన్ని రోజులు ఒంటరిగా గడపడం తన జీవితంలో అదే మొదటిసారి అని వివరించారు. ఆ సమయంలోనే ‘నేనెవరు?’ అనే ప్రశ్నకు సమాధానం దొరికిందన్నారు. అప్పటి నుంచి జీవితాన్ని కొత్త కోణంలో చూస్తున్నానని రానా తెలిపారు. ఆరోగ్య సమస్య తెలిసిన తర్వాత అప్పటికే అంగీకరించిన కొన్ని ప్రాజెక్టులను వదులుకోవాల్సి వచ్చిందన్నారు. అందులో ఒక రెజ్లర్ కథ కూడా ఉందని వెల్లడించారు. శారీరకంగా వచ్చిన మార్పుల వల్ల ఆ పాత్రలకు తాను సరిపోనని భావించి, తీసుకున్న అడ్వాన్స్‌ను సైతం నిర్మాతలకు తిరిగి ఇచ్చేశానని తెలిపారు. అమెరికా నుంచి భారత్‌కు తిరిగి వస్తుండగా ఓ ఇమిగ్రేషన్ అధికారి తనను గుర్తించి కింగ్ భల్లాల దేవ అని పిలవడంతో ‘బాహుబలి’ రోజుల్ని మళ్లీ గుర్తుచేసుకున్నానని ఆనందం వ్యక్తం చేశారు.
Latest News