|
|
by Suryaa Desk | Tue, Feb 10, 2026, 03:24 PM
మహేశ్ బాబు, నమ్రతా శిరోద్కర్ దంపతులు తమ వివాహ బంధంలో 21 వసంతాలు పూర్తి చేసుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని నమ్రత తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. మహేశ్‌తో కలిసి విమానంలో ప్రయాణిస్తున్న ఒక పాత ఫొటోను షేర్ చేసి, తన భర్తపై ఉన్న ప్రేమను చాటుకున్నారు."రెండు దశాబ్దాలు దాటినా, ఇప్పటికీ ప్రతిరోజూ నిన్నే ఎంచుకుంటాను" అంటూ నమ్రత తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌ను మహేశ్ బాబు కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రీషేర్ చేశారు. టాలీవుడ్‌లో అత్యంత అన్యోన్య జంటగా పేరున్న వీరిద్దరి బంధానికి అభిమానులు ఫిదా అవుతున్నారు.ఈ పోస్ట్‌పై బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా స్పందించడం విశేషం. లవ్, ఫైర్, క్లాపింగ్ ఎమోజీలతో ఆమె తన అభినందనలు తెలిపారు.
Latest News