|
|
by Suryaa Desk | Fri, Feb 27, 2026, 03:24 PM
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఫిబ్రవరి 27న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి అనంతరం నూతన దంపతులు తమ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. రష్మిక స్నేహితురాలు కళ్యాణి ప్రియదర్శన్ వారి వివాహ ఫోటోను షేర్ చేస్తూ, 'అత్యంత దయగల అమ్మాయి తన ప్రాణ స్నేహితుడిని వివాహం చేసుకోవడం చూశాను. వారి కళ్లలో కనిపించిన ఆనందభాష్పాలు వారి ప్రేమకు గుర్తులు' అని భావోద్వేగంగా పోస్ట్ చేశారు. స్నేహంగా మొదలై ప్రేమగా మారిన ఈ జంటను ఇలా చూడటం గౌరవంగా భావిస్తున్నానని ఆమె తెలిపారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Latest News