|
|
by Suryaa Desk | Wed, Feb 18, 2026, 12:46 PM
కిడ్నాప్ కేసులో ప్రముఖ సినీ నటుడు, మోహన్‌బాబు యూనివర్సిటీ చాన్స్‌లర్ మంచు మోహన్‌బాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను న్యాయస్థానం మంగళవారం కొట్టివేసింది. అరెస్ట్‌తో పాటు తదుపరి చర్యలు నిలుపుదల చేయాలన్న ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది.ఈ వ్యాజ్యంపై జస్టిస్ వెంకట జ్యోతిర్మయి విచారణ చేపట్టారు. కిడ్నాప్ ఘటనకు ముందు, ఆ తర్వాత కూడా కేసులో ప్రధాన నిందితుడైన యూనివర్సిటీ పీఆర్‌వో సతీశ్‌తో మోహన్‌బాబు ఫోన్‌లో మాట్లాడారని, మెసేజ్‌లు కూడా పంపుకున్నారని పోలీసుల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ కాల్స్, మెసేజ్‌లకు సంబంధించిన ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఇంకా రావాల్సి ఉందని పేర్కొన్నారు.ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, ఫోరెన్సిక్ నివేదిక రానున్న నేపథ్యంలో ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని స్పష్టం చేశారు. కేసులో లోతైన విచారణ జరపాల్సి ఉందని పేర్కొంటూ, ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని మోహన్‌బాబు దాఖలు చేసిన ప్రధాన పిటిషన్‌పై విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేశారు.
Latest News