|
|
by Suryaa Desk | Wed, Feb 25, 2026, 02:59 PM
టాలీవుడ్ నటి తమన్నా 15 ఏళ్లకే సినీ రంగ ప్రవేశం చేసి 20 ఏళ్లుగా టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు. నటీనటులు గ్లామర్ ఉన్నప్పుడే భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టాలని, లేదంటే కెరీర్ ముగిశాక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు. తన ఆర్థిక వ్యవహారాలను తండ్రి చూసుకునేవారని, ఆయన రియల్ ఎస్టేట్, జువెలరీ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం నేర్పించారని తెలిపారు. అవకాశాలున్నప్పుడే సంపాదించిన డబ్బును ఆదా చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం తమన్నా నటిగానే కాకుండా వ్యాపారవేత్తగానూ రాణిస్తున్నారు.
Latest News