|
|
by Suryaa Desk | Fri, Feb 20, 2026, 01:17 PM
కథానాయకుడు సుహాస్ నటించిన తాజా చిత్రం 'హే బల్‌వంత్'. మొదట్లో 'హే భగవాన్' టైటిల్‌తో ప్రచారం జరుపుకున్న ఈ చిత్రాన్ని సెన్సారు సభ్యుల అభ్యంతరం మేరకు' హే బల్‌వంత్'గా మార్చడం జరిగింది. ప్రచార చిత్రాలతో అందరిలోనూ ఆసక్తిని కలిగించిన ఈ చిత్రం ఎలా ఉంది? ఈ సినిమాతో సుహాస్ విజయం దక్కిందా? లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కృష్ణ (సుహాస్) ఎప్పటికైనా నాన్న రావు బల్‌వంత్ (నరేష్) బిజినెస్‌ను టేకప్ చేయాలని ఆశపడుతుంటాడు. కానీ బల్‌వంత్‌కు కొడుకు వ్యాపారం అప్పజెప్పడం ఇష్టం ఉండదు. కానీ కృష్ణ మాత్రం ఎప్పటికైనా ఆయన చేసే బిజినెస్‌ని కంటిన్యూ చేయాలని అనుకుంటాడు.అయితే అందుకోసం బిజినెస్‌లో సరైన అనుభవం రావడం కోసం కొంత మందికి బిజినెస్ సలహాలు ఇస్తుంటాడు. ఆ క్రమంలోనే మిత్ర (శివానీ) పరిచయమవుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. ఈలోపు రావు బల్‌వంత్‌కు ఆరోగ్య సమస్య రావడంతో బిజినెస్ కృష్ణ చేతుల్లోకి వెళుతుంది. నాన్న బిజినెస్ ఏంటో తెలుసుకున్న కృష్ణ షాక్ తింటాడు. ఆశలన్నీ ఒక్కసారిగా కూలిపోతాయి. ఇందువల్ల ప్రేమించిన అమ్మాయి మిత్ర కూడా దూరమవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంతకి రావు బల్‌వంత్ బిజినెస్ ఏమిటి? అందువల్ల కృష్ణ జీవితంలో వచ్చిన మార్పులేమిటి? ఈ బిజినెస్‌కు చంప (స్రవంతి)కి సంబంధమేమిటి? చివరకు ఏం జరిగింది? మిత్ర, కృష్ణలు కలిశారా? లేదా తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Latest News