|
|
by Suryaa Desk | Tue, Feb 17, 2026, 04:04 PM
సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ ఈరోజు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన బాంద్రాలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. తన తండ్రి అస్వస్థతకు గురయ్యారనే విషయం తెలియగానే... షూటింగ్‌లో ఉన్న సల్మాన్ ఖాన్ ఆసుపత్రికి చేరుకున్నారు. సల్మాన్‌తో పాటు ఆయన బావ అతుల్ అగ్నిహోత్రి, ఇతర కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారు. మరోవైపు, సలీం ఖాన్ అనారోగ్యానికి గల కారణాలపై ఆసుపత్రి యాజమాన్యం, సల్మాన్ కుటుంబం ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
Latest News