|
|
by Suryaa Desk | Mon, Feb 16, 2026, 03:57 PM
దర్శకుడు వేణు ఎల్దండి, దేవిశ్రీ ప్రసాద్ హీరోగా 'ఎల్లమ్మ' అనే సినిమా చేస్తున్నారు. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో 'ఎల్లమ్మ' టైటిల్ పాత్రలో రుక్మిణి వసంత్ నటించనున్నట్లు సమాచారం. గతంలో 'కాంతార చాప్టర్ వన్'లో నటించి పాన్ ఇండియా గుర్తింపు పొందిన రుక్మిణి, ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సినిమాలోనూ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎల్లమ్మ పాత్రకు ఆమె న్యాయం చేయగలదని, ఆమె నటిస్తే సినిమాకు అదనపు ఆకర్షణ అవుతుందని అందరూ భావిస్తున్నారు. అయితే ఈ వార్త నిజమో కాదో తెలియాల్సి ఉంది.ఈ చిత్రంలో సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్రలో నటించబోతున్నారని సమాచారం. అది కూడా రాజశేఖర్ ఇందులో హీరో తండ్రి పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తూనే, స్వయంగా సంగీతాన్ని కూడా అందిస్తుండటం విశేషం. దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ఈ పీరియడ్ డ్రామాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే టి-సిరీస్ ఈ సినిమా ఆడియో హక్కులను భారీ ధరకు దక్కించుకుంది.
Latest News