|
|
by Suryaa Desk | Thu, Feb 19, 2026, 11:25 AM
తన అనారోగ్య సమస్యలపై నటుడు రానా దగ్గుబాటి కీలక వ్యాఖ్యలు చేశారు. కిడ్నీ సమస్యలతో అమెరికాలో చికిత్స తీసుకున్న సమయంలో, సినిమాల గురించి ఆలోచించే పరిస్థితి లేదన్నారు. ఏడాది చికిత్స తర్వాత తిరిగి వచ్చి తన ఆరోగ్యంలో వచ్చిన మార్పును చూసి ఆశ్చర్యపోయానని తెలిపారు. ఆపరేషన్‌కు ముందు అంగీకరించిన సినిమాలను వదులుకుని, రెమ్యునరేషన్ కూడా తిరిగి ఇచ్చేశానన్నారు. ఈ అనుభవం మానసిక దృఢత్వాన్ని పెంచిందని, ఆరోగ్యం కంటే గొప్పది ఏదీ లేదని రానా పేర్కొన్నారు.ఇటీవల నటి రియా చక్రవర్తి నిర్వహిస్తున్న ‘చాప్టర్ 2’ అనే పోడ్కాస్ట్‌లో పాల్గొన్న రానా, తన ఆరోగ్య పరిస్థితి కారణంగా ముందుగా ఒప్పుకున్న కొన్ని సినిమాలను వదులుకున్నానని చెప్పారు. “ఆ సమయంలో నేను చేయాల్సిన పాత్రలు బలమైన శరీరాకృతి అవసరమైనవి. కానీ ఆరోగ్య సమస్యల తర్వాత నేను అలా కనిపించలేదు. అందుకే ఆ సినిమాల కోసం తీసుకున్న అడ్వాన్స్ డబ్బులు కూడా తిరిగి ఇచ్చేశాను,” అని రానా వెల్లడించారు.
Latest News