|
|
by Suryaa Desk | Thu, Feb 19, 2026, 11:05 AM
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కర్ణాటకలోని మడికేరిలో సీనియర్ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు 90వ పుట్టినరోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు నిర్మాతకు విలువ లేదని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అభిప్రాయపడ్డారు. నిర్మాత అంటే ఇచ్చేవాడని పేర్కొన్నారు. ఈరోజుల్లో.. తీసుకునేవారే ఇచ్చిన వారిని శాసించే స్థాయిలో ఇండస్ట్రీ ఉందని వ్యాఖ్యానించారు. సీనియర్ ప్రొడ్యూసర్ అట్లురి పూర్ణచంద్రరావుకు సంబంధించి ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో దిల్ రాజు మాట్లాడారు. ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.87 చిత్రాలను నిర్మించిన అట్లూరి సమర్పణలో తాను ఓ సినిమా ప్రొడ్యూస్ చేస్తానని ప్రకటించారు. విలువలతో కూడిన చిత్రాన్ని నిర్మిస్తానని వెల్లడించారు. తన నిర్మాణంలో రూపొందిన తొలి సినిమా ‘దిల్’ను హిందీలో రీమేక్ చేసేందుకుగానూ అట్లూరి రైట్స్ అడిగారంటూ నాటి సంగతులను గుర్తుచేసుకున్నారు.
Latest News