|
|
by Suryaa Desk | Thu, Feb 19, 2026, 03:42 PM
నేను పుట్టింది హైదరాబాద్‌లోనే అయినా.. మా నాన్న ఉద్యోగ రీత్యా చిన్నతనంలోనే మలేషియా వెళ్లా. నా స్కూలింగ్ అంతా అక్కడే సాగింది. స్కూల్లో వాతావరణం, టీచర్లు విద్యార్థుల్ని ప్రోత్సహించే తీరు నన్ను ఎంతో ప్రభావితం చేశాయి. అందుకే పెద్దయ్యాక నేనూ టీచర్ అవ్వాలనుకున్నా. కానీ తిరిగి హైదరాబాద్ వచ్చాక నా స్నేహితురాలి ప్రోత్సాహంతో నా దృష్టి అందాల పోటీలపై పడింది.మిస్ ఇండియా వరల్డ్, మిస్ తెలంగాణ 2020 విన్నర్ మానస వారణాసి.. మిస్ ఇండియా టైటిల్ గెలిచిన తర్వాత విలాసవంతమైన జీవితం లభిస్తుందనే అపోహలపై స్పష్టత ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ.. టైటిల్ గెలిచినప్పుడు స్టేజ్‌పై చెక్ అందిస్తారని, అయితే అందులో నుండి తమకు ఒక్క రూపాయి కూడా అందదని తెలిపారు. వచ్చిన ప్రైజ్ మనీ మొత్తం సంవత్సరం పాటు తమ మెయింటెనెన్స్‌కే ఉపయోగిస్తారని, దీంతో తాము టైటిల్ విన్నర్ అయ్యాక గెలుపొందిన దాంట్లో తమకు ఒక్క రూపాయి కూడా మిగలదని ఆమె వివరించింది.
Latest News