|
|
by Suryaa Desk | Wed, Feb 25, 2026, 07:13 PM
కాంతార సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటుడు రిషబ్ శెట్టి, ఇటీవల ఒక రిపోర్టర్ అడిగిన రష్మిక మందాన, విజయ్ దేవరకొండ పెళ్లి వార్తలపై స్పందించకుండా వెళ్లిపోయారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీరిద్దరి మధ్య గతంలో జరిగిన విభేదాలు, రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టితో రిషబ్ స్నేహం వంటి కారణాల వల్ల ఆయన ఆమె గురించి మాట్లాడటానికి నిరాకరించారని కొందరు భావిస్తున్నారు. రష్మిక నుంచి తనకు పెళ్లి ఆహ్వానం కూడా రాలేదని, అందుకే మాట్లాడలేదని మరికొందరు చెబుతున్నారు.
Latest News