|
|
by Suryaa Desk | Fri, Feb 20, 2026, 03:06 PM
ఎనర్జిటిక్ స్టార్ రామ్, 'ఆంధ్రా కింగ్ తాలూక' సినిమా తర్వాత కొత్త ప్రాజెక్టులపై దృష్టి సారించారు. దర్శకుడు కిషోర్ తిరుమల వద్ద ఒక కథను తీసుకున్న రామ్, మరో కథను కూడా అభివృద్ధి చేస్తున్నారు. రైటింగ్ టీమ్‌తో కలిసి రామ్ స్వయంగా కథా చర్చల్లో పాల్గొంటున్నట్లు సమాచారం. నవీన్ పొలిశెట్టి, సిద్దు జొన్నలగడ్డ వంటి యువ హీరోల మాదిరిగానే, రామ్ కూడా తన తదుపరి చిత్రానికి రచనలో పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అవుతున్నారని తెలుస్తోంది. కొత్త దర్శకుడిని తీసుకుని, సొంత బ్యానర్‌పై సినిమా నిర్మించే యోచనలోనూ రామ్ ఉన్నట్లుగా పరిశ్రమ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Latest News