|
|
by Suryaa Desk | Fri, Feb 27, 2026, 04:12 PM
శ్రీనిధి శెట్టి ...భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె మొదట మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి 2015లో మిస్ కర్ణాటక, మిస్ బ్యూటీఫుల్ స్మైల్, 2016లో మిస్ సుప్రనేషనల్ ఇండియా టైటిల్స్‌ను గెలుచుకొని ...అందం, అభినయం ఉన్నా అదృష్టం కలిసి రాని హీరోయిన్లలో కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి ఒకరు. నాని తో కలిసి హిట్ 3, సిద్దూ జొన్నలగడ్డ తో తెలుసు కదా వంటి లు చేసినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు రావడం లేదు.కేజీఎఫ్, కేజీఎఫ్ 2 లతో పాన్ ఇండియా ఫేమస్ అయిపోయింది కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి. ఇందులో ఆమె అందం, అభినయానికి కుర్రకారు ఫిదా అయిపోయారు.అయితే వీటి తర్వాత శ్రీనిధి నటించిన కోబ్రా పెద్దగా ఆడలేదు. విక్రమ్ హీరోగా తెరకెక్కిన ఈ జస్ట్ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది.అయితే న్యాచురల్ స్టార్ నానితో కలిసి శ్రీనిధి శెట్టి నటించిన హిట్ 3 బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.దీని తర్యాత స్టార్ బాయ్ సిద్దూ జొన్నలగడ్డతో కలిసి తెలుసు కదా అనే లో హీరోయిన్ గా నటించింది శ్రీనిధి శెట్టి.అయితే ఈ కేవలం యావరేజ్ గా మాత్రమే ఆడింది.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ విక్టరీ వెంకటేష్ నటిస్తోన్న ఆదర్శ కుటుంబం అనే లో హీరోయిన్ గా నటిస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ ను తెరకెక్కిస్తున్నాడు.సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే శ్రీనిధి శెట్టి లేటెస్ట్ గా కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేసింది. ఇందులో చీర కట్టుతో మేకప్ లేకుండా సింపుల్ లుక్ తో కట్టి పడేసిందీ అందాల తార.