|
|
by Suryaa Desk | Fri, Feb 27, 2026, 03:57 PM
ఒకప్పుడు కళాకారులుగా పరిమితమైన నటులు ఇప్పుడు గ్లోబల్ బ్రాండ్‌లుగా మారారు. టర్కీ నటుడు బురాక్ ఓజ్చివిట్ దుబాయ్‌లో జరిగిన ఒక ప్రైవేట్ ఈవెంట్‌లో కేవలం 15 నిమిషాలు ఒక మహిళ పక్కన కూర్చున్నందుకు 3.7 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 30 కోట్లు) పారితోషికం అందుకున్నారు. మధ్యప్రాచ్య దేశాల్లో టర్కిష్ సిరీస్‌లకు, బురాక్‌కు ఉన్న ఆదరణ దీనికి కారణం. సెలబ్రిటీ కల్చర్ కేవలం వినోదాన్ని పంచడమే కాకుండా, సామాజిక అసమానతలను పెంచుతోందని, విద్యావంతులు, శాస్త్రవేత్తలకు దక్కని గౌరవం, సంపద వినోద రంగంలోని వారికే దక్కుతోందని విమర్శలు వస్తున్నాయి.ప్రస్తుతం సెలబ్రిటీ అంటే కేవలం ప్రతిభ ఉన్నవారు మాత్రమే కాదు, సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్నవారు. హాలీవుడ్ నుంచి మన టాలీవుడ్ వరకు, చివరకు చిన్నపాటి యూట్యూబ్ స్టార్ల వరకు అందరూ ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు.కేవలం రిబ్బన్ కటింగ్ లేదా ఒక మాల్ ఓపెనింగ్‌కు హాజరైతే చాలు, నిమిషాల్లో లక్షలు, కోట్లు వచ్చిపడుతున్నాయి.అభిమానుల భావోద్వేగాలే ఇప్పుడు మార్కెట్ విలువను నిర్ణయిస్తున్నాయి. ఒక స్టార్ ఏ కారులో తిరుగుతున్నారు, ఏ బ్రాండ్ టీషర్ట్ వేసుకున్నారు అనేది ఇప్పుడు యూత్ కు ఒక టాపిక్ అయిపోయింది.
Latest News