|
|
by Suryaa Desk | Fri, Feb 13, 2026, 01:16 PM
హీరో సంతోష్ శోభన్, మాజీ మిస్ ఇండియా మానస వారణాసి జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'కపుల్ ఫ్రెండ్లీ'. ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదల కానుంది. అయితే, విడుదలకు ఒక రోజు ముందే, అంటే ఫిబ్రవరి 13న, తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రధాన నగరాల్లో ప్రత్యేక ప్రీమియర్ షోలను ఏర్పాటు చేశారు.నేడు హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని ఏఏఏ సినిమాస్‌లో, విశాఖలోని మెలోడీ, విజయవాడలోని శైలజ థియేటర్లలో, గుంటూరులోని భాస్కర్ థియేటర్‌లో రాత్రి 7 గంటలకు ప్రీమియర్లు ప్రారంభమవుతాయి. అలాగే, నెల్లూరు ఎం1 సినిమాస్‌లో రాత్రి 9 గంటలకు, తిరుపతి పీజీఆర్ థియేటర్‌లో సాయంత్రం 6:45 గంటలకు ఈ స్పెషల్ షోలను ప్రదర్శించనున్నారు.యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై అజయ్ కుమార్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు.
Latest News