|
|
by Suryaa Desk | Sat, Feb 21, 2026, 03:35 PM
మహిళల దుస్తులపై గతంలో చేసిన వ్యాఖ్యల గురించి నటుడు శివాజీ స్పందించారు. డ్రెస్సింగ్ విషయంపై మాట్లాడేటప్పుడు ఆ రెండు పదాలు వాడకుండా ఉంటే బావుండు అని ఇప్పుడు అనిపిస్తోందన్నారు. ఆ రోజు ఎందుకు అలా మాట్లాడానో తనకే అర్థం కాలేదని, ఆ సంఘటన తర్వాత తీవ్ర మానసిక సంఘర్షణకు గురయ్యానని చెప్పారు. ఆ కామెంట్స్ చేసినందుకు మూడు రోజులు నిద్ర కూడా పోలేదని తెలిపారు. ఎన్నో ప్రెస్‌మీట్లు, చర్చల్లో మాట్లాడినా ఎప్పుడూ నోరు జారలేదని, ఆ రోజు అనుకోకుండా అలా జరిగిపోయిందన్నారు.
Latest News