|
|
by Suryaa Desk | Tue, Feb 17, 2026, 01:47 PM
హీరోయిన్, బీజేపీ నేత ఖుష్బూ సుందర్ కుమార్తె అవంతిక సుందర్ వెండితెర అరంగేట్రానికి సిద్ధమయ్యారు. ఆమె మలయాళ చిత్ర పరిశ్రమ ద్వారా హీరోయిన్‌గా పరిచయం కాబోతున్నారు. ఆమె నటిస్తున్న తొలి చిత్రానికి 'ఆరంభం' అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఇటీవలే త్రిశూర్‌లోని చావక్కాడ్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సుమారు 35 ఏళ్ల క్రితం 1991లో ఖుష్బూ సైతం మోహన్ లాల్ సరసన 'అంకుల్ బన్' అనే మలయాళ చిత్రంతోనే ఆ పరిశ్రమలో అడుగుపెట్టారు. ఇప్పుడు ఆమె కూతురు అవంతిక కూడా తల్లి బాటలోనే నడవడం విశేషం. ఈ కొత్త చిత్రంలో అవంతిక 'ఆరతి' అనే పాత్రలో కనిపించనున్నారు.సుజేష్ అన్నీ ఈపెన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో బెల్లారూహ్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇందులో ఇంద్రన్స్, విజయరాఘవన్, అల్తాఫ్ సలీం, కళాభవన్ షాజోన్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Latest News