|
|
by Suryaa Desk | Mon, Feb 23, 2026, 04:32 PM
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు, టాలీవుడ్ యాక్టర్ అల్లు శిరీష్ -నయానికా రెడ్డి వివాహం మార్చి 6న జరగనుంది. ఈ నేపథ్యంలో, అల్లు అరవింద్ దంపతులు, అల్లు శిరీష్ తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆయన సతీమణి అన్నా లెజినోవా దంపతులకు, నాగబాబు దంపతులకు వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను స్వయంగా శిరీష్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.మార్చి 6న అల్లు శిరీష్ -నయనిక ఒకటి కానున్నారు. ఈ వేడుకకు ఇప్పటికే చిరంజీవికి ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. ఇటీవలే పసుపు దంచే కార్యక్రమం జరిగింది. ఆ ఫొటోలను అల్లు అర్జున్ సతీమణి స్నేహ ఈరోజు తన ఇన్‌స్టాలో పంచుకున్నారు.హైదరాబాద్‌లోనే వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు ఈ వేడుకకు హాజరవుతారని సమాచారం. ఇక ఇటీవలే దుబాయ్‌లో ఫ్రెండ్స్ సర్కిల్‌కు బ్యాచ్‌లర్ పార్టీ ఇచ్చారు. అక్కడి నుంచి వచ్చాక ఫిబ్రవరి 20న అల్లు అర్జున్ హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులకు, టాలీవుడ్ నటీనటులకు పార్టీ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో రామ్ చరణ్ దంపతులతో పాటు శ్రీలీల, మృణాల్, ఫరియా అబ్దుల్లా మరికొందరు సందడి చేశారు.
Latest News