|
|
by Suryaa Desk | Sat, Feb 14, 2026, 10:55 AM
తెలంగాణ యాసతో ప్రత్యేక గుర్తింపు పొందిన యాంకర్ శివ జ్యోతి తల్లయ్యారు.యాంకర్ శివ జ్యోతి ( Anchor Shiva Jyothi ) దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. ఫిబ్రవరి 12వ తేదీన పండంటి బిడ్డకు యాంకర్ శివ జ్యోతి జన్మనిచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియాలో యాంకర్ శివజ్యోతి, గంగూలీ పోస్ట్ పెట్టారు. అయితే ఈ జంటకు జన్మించింది అమ్మాయా? లేదా అబ్బాయా? అనే విషయాన్ని పేర్కొనలేదు. తమకు పుట్టిన బిడ్డ జెండర్ ను త్వరలోనే రివీల్ చేస్తానని సోషల్ మీడియాలో శివ జ్యోతి పోస్ట్ పెట్టారు. ఫిబ్రవరి 12వ తేదీన తమ ఇంటికి మూడవ వ్యక్తి వచ్చారని ఎమోషనల్ అయ్యారు శివ జ్యోతి. దీంతో శివ జ్యోతి దంపతులు చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్స్, కంగ్రాట్స్ చెబుతున్నారు.ఈ నేపథ్యంలోనే ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పాపులర్ అయిన శివ జ్యోతి, సోషల్ మీడియాలో కూడా నిత్యం యాక్టివ్ గా ఉంటుంది. అయితే అలాంటి యాంకర్ శివజ్యోతి తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది.
Latest News