|
|
by Suryaa Desk | Fri, Feb 27, 2026, 11:28 PM
టాలీవుడ్ హీరో, హీరోయిన్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం అంగరంగ వైభవంగా జరిగినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. వారి పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చర్చనీయాంశమవుతున్నాయి.పెళ్లి వేడుకలో రష్మిక, విజయ్ ధరించిన దుస్తులు మరియు ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా వారి వెడ్డింగ్ అవుట్‌ఫిట్స్ అందాన్ని మరింత మెరుగు పరిచాయి. ఈ ప్రత్యేక దుస్తులను రూపొందించింది ప్రముఖ సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ అనామిక ఖన్నా. ఇండియన్ స్టార్‌లతో పాటు హాలీవుడ్ మరియు పాప్ సెలబ్రిటీలకూ ఆమె డిజైన్లు అందించింది. షకీరా, జెన్నిఫర్ లోపెజ్, ఓప్రా విన్‌ఫ్రే, కెల్లీ రోలాండ్, బియోన్స్, కర్దాషియన్ కుటుంబ సభ్యులు వంటి పలువురు ప్రముఖులు ఆమె రూపొందించిన దుస్తులు ధరించారు. అంబానీ కుటుంబ వివాహ వేడుకలలోనూ అనామిక డిజైన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాధిక మర్చంట్ వెడ్డింగ్ అవుట్‌ఫిట్‌ను కూడా ఆమె డిజైన్ చేసింది. అలాగే ఇషా అంబానీ మెట్ గాలా రెడ్ కార్పెట్‌పై అనామిక రూపొందించిన దుస్తుల్లో మెరిసింది.అనామిక ఖన్నా భారతదేశంలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లలో ఒకరు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆమె భరతనాట్యం నర్తకి, చిత్రకారిణి కూడా. ఆశ్చర్యకరంగా, ఆమె ఎటువంటి ఫార్మల్ ఫ్యాషన్ డిజైన్ కోర్సు చేయకుండా స్వీయ అభ్యాసంతో ఈ రంగంలో ప్రవేశించింది. 1990లో తన సొంత ఫ్యాషన్ బ్రాండ్‌ను ప్రారంభించిన ఆమె, భారతదేశం నుంచి అంతర్జాతీయ ఫ్యాషన్ వీక్ వేదికపై కలెక్షన్ ప్రదర్శించిన తొలి మహిళా డిజైనర్‌గా గుర్తింపు పొందారు. ‘బిజినెస్ ఆఫ్ ఫ్యాషన్ (BOF) 500’ జాబితాలో కూడా ఆమె స్థానం సంపాదించారు.ప్రియాంక చోప్రా ధరించిన ‘వారణాసి’ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ దుస్తులు కూడా అనామిక ఖన్నానే డిజైన్ చేశారు. దీపికా పదుకొనే, సోనమ్ కపూర్, అలియా భట్, జాన్వీ కపూర్ వంటి పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆమె రెగ్యులర్ క్లయింట్లు. దేశంలో అత్యంత ఖరీదైన డిజైనర్లలో అనామిక ఒకరు. ఆమె రెగ్యులర్ డిజైన్ల ధరలు సుమారు రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ఉంటాయి. ప్రత్యేక ఆర్డర్ డిజైన్లు అయితే రూ.50 లక్షల వరకు చేరుతాయి. కొన్ని ప్రత్యేక కలెక్షన్లు కోటి రూపాయల విలువ కలిగి ఉంటాయని చెబుతారు. ఆమెకు ‘AK-OK’ అనే బ్రాండ్ కూడా ఉంది. కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ నగరాల్లో ఆమె అవుట్‌లెట్లు ఉన్నాయి.విజయ్, రష్మికల వెడ్డింగ్ అవుట్‌ఫిట్స్ ఖచ్చితమైన ధర వెల్లడికాకపోయినా, ఆభరణాలను మినహాయిస్తే దుస్తుల ఖర్చే సుమారు రూ.50 లక్షల వరకు ఉండవచ్చని ఫ్యాషన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Latest News