|
|
by Suryaa Desk | Fri, Feb 27, 2026, 03:21 PM
రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టాలీవుడ్ యాక్టర్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి ముందే ఈ జంట ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లూ గోప్యంగా ఉన్న ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను తాజాగా విజయ్ టీమ్ విడుదల చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ప్రధాని మోదీని కలిసి ఆశీస్సులు తీసుకోవడంతో పాటు మార్చి 4న హైదరాబాద్ లో జరగనున్న తమ వెడ్డింగ్ రిసెప్షన్ కు ఆయనను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రధాని నూతన దంపతులకు తన శుభాకాంక్షలు తెలియజేసినట్లు సమాచారం.
Latest News