|
|
by Suryaa Desk | Fri, Feb 20, 2026, 03:10 PM
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి పునర్నవి భూపాలం తన ప్రియుడు హేమంత్ వర్మతో ఫిబ్రవరి 19న నిశ్చితార్థం చేసుకున్నారు. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ వేడుకలో లగ్న పత్రిక కూడా రాసుకున్నారు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అయిన హేమంత్‌తో పునర్నవి చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. బిగ్‌బాస్3తో గుర్తింపు పొందిన పునర్నవి, ఇప్పుడు కొత్త జీవితంలోకి అడుగుపెట్టనున్నారు.తెలుగు ఆడియెన్స్‌కు పునర్నవి భూపాలం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రాజ్ తరుణ్, అవికా గోర్ జంటగా నటించిన ఉయ్యాల జంపాల సినిమాతో ఆమె తెలుగు తెరకు పరిచయమైంది. ఈ చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో కనిపించి ప్రేక్షకులకు దృష్టిని ఆకర్షించింది. ఈసినిమాలో అద్భుతంగా నటించి మెప్పించిన పునర్నవి.. ఆతరువాత తెలుగులో చాలా సినిమాల్లో నటించిమెప్పించింది. కానీ ఆమెకు అనుకున్నంత గుర్తింపు మాత్రం రాలేదు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో అవకాశం రావడంతో.. మరింత గుర్తింపు పొందింది. బిగ్ బాస్ లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న ఆమె, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో లవ్ ట్రాక్ నడిపి వార్తల్లో నిలిచింది. హౌస్ లో వీరి తీరు చూసిన జనాలు.. బయటకు వచ్చిన తరువాత ప్రేమలో మునిగిపోయి.. పెళ్లి కూడా చేసుకుంటారేమో అనుకున్నారు. కానీ ఆ అనుబంధం షో ముగిసిన తర్వాత కొనసాగలేదు. హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఎవరి దారి వారు చూసుకున్నారు.
Latest News