|
|
by Suryaa Desk | Fri, Feb 13, 2026, 06:16 PM
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, నాగార్జునతో సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల నాగార్జునను కలిసిన అనిల్, ఆయనకు ఒక కథాంశాన్ని వినిపించారని, అది నాగార్జునకు బాగా నచ్చిందని సమాచారం. ప్రస్తుతం నాగార్జున కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసి, వచ్చే సంవత్సరం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి. అనిల్ రావిపూడి తన కెరీర్ లో 9 సినిమాలకు 100% సక్సెస్ రేటు సాధించి, రాజమౌళి తర్వాత రెండో స్థానంలో నిలిచారు. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలతో సినిమాలు చేసిన ఆయన, నాగార్జునకు కూడా సక్సెస్ అందించాలని చూస్తున్నారు.
Latest News