|
|
by Suryaa Desk | Sat, Feb 14, 2026, 03:46 PM
సూర్య–వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రానికి ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.షూటింగ్ దాదాపు పూర్తై, ఇంకా ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉంది.ప్రొడ్యూసర్ నాగవంశీ ప్రకారం, సూర్య నటిస్తున్న ‘కరుప్పు’ విడుదలైన మూడు–నాలుగు నెలల తర్వాతే ‘#Suriya46’ రిలీజ్ కానుంది. ‘#Karuppu’ ఏప్రిల్ 2026లో రానుండటంతో, ఈ చిత్రం జులై లేదా ఆగస్టు 2026లో థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది.ఈ సినిమాలో ‘ప్రేమలు’ ఫేమ్ మమిత బైజు హీరోయిన్‌గా నటిస్తుండగా రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వయసులో చాలా వ్యత్యాసం ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య సాగే ఆసక్తికరమైన ప్రేమకథగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే చిత్రీకరణ దాదాపు పూర్తయ్యింది. కేవలం ఐదు రోజుల షూటింగ్ మాత్రమే బాకీ ఉంది. ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
Latest News