|
|
by Suryaa Desk | Fri, Feb 20, 2026, 10:44 AM
గ్రేస్ అనాటమీ, యుఫోరియా చిత్రాల ద్వారా గుర్తింపు పొందిన హాలీవుడ్ నటుడు ఎరిక్ డేన్ (53) కన్నుమూశారు. గతేడాది కాలంగా ALS (మోటార్ న్యూరాన్ వ్యాధి)తో పోరాడుతున్న ఆయన గురువారం మరణించినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. 'డాక్టర్ మెక్మీ'గా పాపులర్ అయిన ఆయన, తన చివరి రోజుల్లో ఈ వ్యాధిపై అవగాహన కల్పించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.ఇటీవల కాలంలో ఓటీటీలు వచ్చిన తర్వాత భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా అన్ని భాషా చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు . ఇటు టాలీవుడ్ మొదలుకొని అటు హాలీవుడ్ వరకు అన్ని సినిమాలు వివిధ జానర్లలో ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయా భాషలకు చెందిన సెలబ్రిటీలు కూడా ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సెలబ్రిటీలకు సంబంధించిన ఏ విషయమైనా సరే వైరల్ అవుతోంది.
Latest News