|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 03:42 PM
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలకు వారి కొత్త సినిమా టీమ్ నుంచి ఓ స్పెషల్ సర్‌ప్రైజ్ అందింది. ఇటీవలే వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంటకు కానుకగా, వారు నటిస్తున్న 'రణబాలి' చిత్రం నుంచి ఓ రొమాంటిక్ మెలోడీ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. "ఎందయ్య సామి" అంటూ సాగే ఈ పాటను శనివారం రిలీజ్ చేశారు.రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ఇందులో విజయ్ 'రణబాలి' అనే పవర్‌ఫుల్ పాత్రలో, రష్మిక 'జయమ్మ'గా కనిపించనున్నారు. తాజాగా విడుదలైన "ఎందయ్య సామి" పాటకు ప్రముఖ సంగీత ద్వయం అజయ్-అతుల్ స్వరాలు సమకూర్చారు. ఈ పాటలో విజయ్, రష్మికల మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండిందని, వారిద్దరినీ చూస్తుంటే 'గీత గోవిందం' రోజులు గుర్తుకొస్తున్నాయని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
Latest News