|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 03:36 PM
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ పెళ్లి ఫొటోలతో సోషల్ మీడియాలో సరికొత్త చరిత్ర సృష్టించారు. ఈ నెల 26న ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా ఒక్కటైన ఈ జంట, తమ వివాహ చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా లైకుల వర్షం కురుస్తోంది. ఈ పోస్ట్ కేవలం 24 గంటల్లోనే భారతీయ సెలబ్రిటీల పెళ్లిళ్ల రికార్డులన్నింటినీ తిరగరాసి, సోషల్ మీడియాలో వారికున్న అసాధారణమైన క్రేజ్‌ను మరోసారి నిరూపించింది.ఇప్పటివరకు బాలీవుడ్ జంట కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లి ఫొటోలకు వచ్చిన 16 మిలియన్ల లైక్సే అత్యధిక రికార్డుగా ఉండేది. అయితే, 'విరోష్' (విజయ్-రష్మిక) జంట ఈ మైలురాయిని కేవలం 14 గంటల్లోనే దాటేసి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం వీరి పోస్ట్ 23.3 మిలియన్ల లైక్స్‌తో దూసుకుపోతోంది. దీంతో అలియా భట్-రణబీర్ కపూర్ (13 మిలియన్+), సమంత-నాగ చైతన్య (12 మిలియన్+), కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ (10 మిలియన్+), దీపికా పదుకొనే-రణవీర్ సింగ్ (8 మిలియన్+) వంటి స్టార్ కపుల్స్ రికార్డులను ఈ జంట అధిగమించింది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే విరాట్ కోహ్లీ వ్యక్తిగత పోస్ట్ రికార్డుకు కూడా చేరువయ్యే అవకాశం కనిపిస్తోంది.
Latest News