|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 03:37 PM
బాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు రాజ్‌పాల్ యాదవ్ తన జీవితంలో ఓ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఇటీవలే చెక్ బౌన్స్ కేసులో బెయిల్‌పై విడుదలైన ఆయన, తాజాగా 'రాజ్‌పాల్ నౌరంగ్ యాదవ్' పేరుతో తన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌ను లాంచ్ చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో ద్వారా అభిమానులతో పంచుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "మిత్రులారా, నేను మీ రాజ్‌పాల్. ఓ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించేందుకు చాలా కాలంగా సిద్ధమవుతున్నాను. ఆ క్షణం ఇప్పుడు వచ్చింది. నాకు మీ అందరి ఆశీస్సులు కావాలి" అని కోరారు. తన యూట్యూబ్ ఛానెల్ ఉద్దేశాన్ని వివరిస్తూ, "పిల్లలు, పెద్దలు, యువకులు.. అందరికీ ఒకే రకమైన వినోదాన్ని అందించడమే ఈ ఛానెల్ లక్ష్యం. మంచి రక్త ప్రసరణ కోసం ఆరోగ్యకరమైన వినోదం చాలా అవసరం. ఈ ఛానెల్ మీదే, ఆస్వాదించండి, షేర్ చేయండి, సబ్‌స్క్రైబ్ చేసుకోండి" అని ఆయన తెలిపారు.
Latest News