|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 11:01 AM
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చి బాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా రామ్ చరణ్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం ప్రారంభించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. ఈ సినిమాను ఏప్రిల్ 30న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ప్రచారంలో భాగంగా మార్చి 2న 'రై రై రారా' అనే సెకండ్ సాంగ్ రిలీజ్ కాబోతోంది.
Latest News