|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 12:56 PM
శ్రీవిష్ణు నటించిన 'విష్ణు విన్యాసం' చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకున్నా, యూత్ క్రేజ్ తో బ్లాక్ బస్టర్ వైపు అడుగులు వేస్తోంది. మూడవ రోజున 35 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. మొదటి మూడు రోజులకు బుక్ మై షోలో 1.20 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.8 కోట్లు కాగా, మూడు రోజుల్లో రూ.5.60 కోట్ల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ కు మరో 2.40 కోట్ల షేర్ అవసరం. మార్చి 19 వరకు కొత్త సినిమాలు లేకపోవడంతో 20 కోట్ల షేర్ మార్కును అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Latest News