|
|
by Suryaa Desk | Fri, Mar 06, 2026, 09:26 PM
పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’. రామ్ చక్రి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది.విలక్షణ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తుండగా, ప్రముఖ దర్శకుడు-నటుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్టు మేకర్స్ గురువారం ప్రకటించారు. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ఈ సినిమాకు అధికారిక థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్‌నర్‌గా వ్యవహరించనుంది. దేశవ్యాప్తంగా పీవీఆర్ తన విస్తరణను పెంచుకుంటున్న నేపథ్యంలో, ‘కార్మేని సెల్వం’ను భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన లభించింది. ఆధునిక సమాజ నేపథ్యంతో సాగే ఈ కథపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. త్వరలో విడుదల చేయనున్న టీజర్‌తో మరింత క్యూరియాసిటీ పెంచాలని చిత్రబృందం భావిస్తోంది. ఈ సినిమా కథ నిజాయితీతో జీవించే ఒక సాధారణ కార్ డ్రైవర్ అయిన సెల్వం జీవితాన్ని చుట్టూ తిరుగుతుంది. సమాజంలో ఎదురయ్యే ఒత్తిళ్లు, పరిస్థితుల మధ్య అతను ఎలా ముందుకు సాగుతాడు అన్నది భావోద్వేగంగా చూపించనున్నారు. సాధారణ మనిషి జీవన పోరాటాన్ని ప్రతిబింబించే హై స్టేక్స్ డ్రామాగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది.ఈ చిత్రంపై దర్శకుడు రామ్ చక్రి మాట్లాడుతూ… “‘కార్మేని సెల్వం’ ఒక సాధారణ మనిషి జీవితం ఆధారంగా రూపొందిన కథ. ఈ సినిమాను తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ మా చిత్రానికి థియేట్రికల్ పార్ట్‌నర్‌గా ఉండటం వల్ల ఈ కథ మరింత పెద్ద స్థాయిలో ప్రేక్షకులకు చేరుతుందని నమ్ముతున్నాం” అని తెలిపారు.
Latest News