|
|
by Suryaa Desk | Tue, Mar 10, 2026, 12:11 PM
నటి లావణ్య త్రిపాఠి, మెగా ఇంటి కోడలు, సామాజిక మాధ్యమాలలో తమ పరువుకు భంగం కలిగించేలా వేధింపులకు పాల్పడుతున్న వారిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆన్‌లైన్ వేధింపులకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.ఆమెను ట్రోల్ చేయడం మాత్రమే కాకుండా, ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేయడం, అసభ్యకరంగా చిత్రీకరించడం, అసత్య ప్రచారాలను చేయడం చేస్తున్నారు. సోషల్ మీడియాలో తన పైన జరుగుతున్న దుష్ప్రచారాన్ని సహించలేని స్థితిలో లావణ్య త్రిపాటి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తన పైన తన కుటుంబ సభ్యుల పైన సోషల్ మీడియా వేదికగా అసభ్యంగా పోస్టులు చేస్తున్నారని ఆపై తప్పుడు కామెంట్లతో దూషిస్తున్నారు అని లావణ్య త్రిపాఠి పోలీసులకు తెలిపారు.కొంతకాలంగా తనపైన ఇలాంటి వేధింపులు కొనసాగుతున్నాయని లావణ్య త్రిపాఠి వాపోయారు అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు అని చెప్పారు. పర్పుల్ క్రెయాన్ 00 insta ఖాతాకు సంబంధించిన వ్యక్తిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. వేధింపులకు పాల్పడుతున్న youtube ఐడీలు, థంబ్ నెయిల్స్ , ఎక్స్ హ్యాండిల్స్, insta హ్యాండిల్స్ తదితర వివరాలను ఆమె పోలీసులకు అందించారు.
Latest News