|
|
by Suryaa Desk | Wed, Mar 11, 2026, 11:31 AM
స్టార్ హీరో విజయ్, నటి త్రిషల వ్యక్తిగత జీవితాలపై గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఇప్పుడు బాలీవుడ్ వరకు చేరింది. ఇటీవల ఒక వివాహ వేడుకలో వీరిద్దరూ కలిసి కనిపించడంతో వీరి మధ్య ఏదో ఉందంటూ జరుగుతున్న ప్రచారానికి మరింత బలం వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ... విజయ్-త్రిషల వ్యక్తిగత జీవితాల గురించి బయట చాలా వినిపిస్తోంది. ఆ రూమర్స్ నిజమో, కాదో నాకు అనవసరం. కానీ ఒకవేళ అవి నిజమైతే, వారిద్దరూ చాలా హుందాగా వ్యవహరిస్తున్నారు, దేన్నీ దాచడం లేదు. సమాజం తరచుగా వ్యక్తులను వారు ఇష్టపడని బంధాల్లో బంధిస్తుంది, అది ఒక జైలు లాంటిది. ఒక వ్యక్తికి తన మనసు చెప్పిన చోట ప్రేమను వెతుక్కునే హక్కు ఉంటుంది. నటీనటుల సినిమాలు మాత్రమే మనకు సొంతం, వారి వ్యక్తిగత జీవితాలు కాదు. వారిని జడ్జ్ చేసే హక్కు మనకు లేదు" అని విక్రమ్ భట్ రాసుకొచ్చారు. సమాజం ఒక సమూహంగా మారినప్పుడు ఇతరుల పట్ల సానుభూతిని కోల్పోయి, తీర్పులు చెప్పే జడ్జిలుగా మారుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Latest News