|
|
by Suryaa Desk | Wed, Mar 04, 2026, 03:50 PM
ప్రపంచ శాంతి, ఐక్యతను కోరుతూ తాను చేసిన వ్యాఖ్యలపై విమర్శలు చేస్తున్న వారికి బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ నోరా ఫతేహి గట్టిగా బదులిచ్చారు. తన అభిప్రాయానికి కట్టుబడి ఉన్నానని, అందులో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో మరో వీడియోను విడుదల చేశారు. పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో, ప్రపంచ శాంతికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతూ నోరా ఓ వీడియో పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియోపై కొందరు నెటిజన్లు ఆమెను ట్రోల్ చేశారు. దీనికి స్పందనగా నోరా తాజాగా మరో వీడియోను షేర్ చేశారు. "ప్రపంచ శాంతి, ఐక్యత అనే మాటలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే.. దయచేసి సహాయం తీసుకోండి" అనే క్యాప్షన్‌తో ఆమె ఈ వీడియోను విడుదల చేశారు.ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. "చాలా మందికి విషయాన్ని అర్థం చేసుకునే నైపుణ్యం, వినగలిగే సామర్థ్యం తగ్గిపోయినట్టుంది. శాంతియుతంగా జీవించాలని నేను ప్రపంచంలోని ప్రజలందరి గురించి మాట్లాడాను. గందరగోళానికి వ్యతిరేకంగా మాట్లాడాను. నా మాటలతో మీకు సమస్య ఉంటే, నైతికంగా మీలోనే ఏదో లోపం ఉన్నట్టు. మిమ్మల్ని మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి" అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
Latest News