|
|
by Suryaa Desk | Fri, Mar 06, 2026, 08:22 PM
కేజీఎఫ్ తర్వాత యష్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'టాక్సిక్' విడుదల ఊహించని విధంగా వాయిదా పడింది. మార్చి 19న విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు జూన్ 4కు వాయిదా పడినట్లు మేకర్స్ ప్రకటించారు. గ్లోబల్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకోవడం, మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులు ప్రతికూలంగా ఉండటమే దీనికి ప్రధాన కారణాలని తెలిపారు. వాతావరణం ప్రశాంతంగా మారిన తర్వాత పూర్తిస్థాయి ప్రమోషన్స్‌తో థియేటర్లలోకి రావాలని బృందం సిద్ధమవుతోంది.‘మేం ఈ ‘టాక్సిక్’ను అన్ని భాషల్లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లిష్‌లోనూ రిలీజ్ చేయాలి. ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితులు అందరికీ తెలిసినవే. ఇలాంటి సమయంలో సినిమాను విడుదల చేయడం సరైన నిర్ణయం కాదు. అందుకే వాయిదా వేస్తున్నాం’’ అని నిర్మాణ సంస్థ పేర్కొంది. ఇక ఇందులో యశ్‌తో పాటు అయిదుగురు హీరోయిన్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నదియా పాత్రలో కియారా కనిపించనుండగా హ్యుమా ఖురేషీ ఎలిజిబెత్‌గా, నయనతార గంగ పాత్రలో, రెబెకాగా తారా సుతారియా అలరించనున్నారు. మెలిసా అనే పాత్రలో రుక్మిణి వసంత్ ఆకట్టుకోనున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.
Latest News