|
|
by Suryaa Desk | Mon, Mar 09, 2026, 08:18 PM
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ ఇచ్చారు. కావ్యారెడ్డి అనే అమ్మాయితో తన నిశ్చితార్థం జరిగిందంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో బెల్లంకొండ శ్రీనివాస్ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన కాస్తంత రొమాంటిక్ గా స్పందించారు. నా కావ్యమ్మకు జీవితానికి దానికంటూ ఒక అందమైన సమయం ఉంటుంది ఆ సమయమే నిన్ను నా ప్రపంచంలోకి తీసుకొచ్చింది. సరైన సమయంలో నా జీవితంలోకి వచ్చి, నాపై నమ్మకం ఉంచినందుకు థాంక్స్. నా రోజులను పాజిటివిటీతో, లెక్కలేనన్ని చిరునవ్వులతో నింపేశావు. నీ ముఖంలో ఆ చిరునవ్వు ఎప్పటికీ చెదరకుండా చూసుకుంటాను. మనమిద్దరం శాశ్వతంగా కలిసి ఉండే ఆ క్షణాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అంటూ శ్రీనివాస్ తన ప్రేమను వ్యక్తపరిచారు.అలాగే, ఇటీవల జరిగింది ఎంగేజ్‌మెంట్ కాదని ఆయన స్పష్టం చేశారు.అందరూ అడుగుతున్నట్లుగా ఇది ఎంగేజ్‌మెంట్ కాదు, కేవలం కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఒక చిన్న ప్రకటన మాత్రమే. అసలు వేడుకలు ఇంకా మొదలవ్వలేదు. త్వరలోనే తేదీలను ప్రకటిస్తాం. మీ ప్రేమ, మద్దతు నాకు ఎంతో ముఖ్యం అని శ్రీనివాస్ పేర్కొన్నారు.శ్రీనివాస్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. తమ అభిమాన హీరో జీవితంలో కొత్త అడుగు వేస్తుండటంతో అభిమానులు, నెటిజన్లు ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. త్వరలోనే వేడుకల తేదీలు వెలువడే అవకాశం ఉంది.
Latest News