|
|
by Suryaa Desk | Fri, Mar 06, 2026, 07:57 PM
ప్రముఖ బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. వీరిద్దరూ జంటగా నటిస్తున్న చిత్రం 'పెద్ది'. జాన్వీ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా సెట్స్ నుంచి కొన్ని ఆసక్తికరమైన బిహైండ్ ది సీన్స్ దృశ్యాలను చరణ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వీడియోలో జాన్వీ తన పాత్ర 'అచ్చియమ్మ' గెటప్‌లో కనిపిస్తూ సందడి చేశారు.షూటింగ్ సమయంలో చరణ్, జాన్వీ ఇతర టీమ్ మెంబర్స్‌తో సరదాగా గడుపుతున్న లైట్ హార్టెడ్ మూమెంట్స్ ఈ వీడియోలో హైలైట్‌గా నిలిచాయి. ఈ సందర్భంగా చరణ్ స్పందిస్తూ.. "మా అచ్చియమ్మ, ఎంతో హుందాగా ఉండే జాన్వీ కపూర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. తన వృత్తి పట్ల ఆమెకున్న ప్యాషన్, నిబద్ధత చూడటం చాలా సంతోషంగా ఉంది. ఈ ఏడాది తనకి అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను" అని రాసుకొచ్చారు.
Latest News