|
|
by Suryaa Desk | Fri, Nov 07, 2025, 02:59 PM
పాన్ ఇండియా చిత్రాలతో అగ్ర కథానాయికగా తనకంటూ ఓ గుర్తింపు సంపాందించుకున్న రష్మిక మందన ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం 'ది గర్ల్ ఫ్రెండ్'. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించే కంటెంట్ ఉందా? రష్మిక మందనకు 'ది గర్ల్ ఫ్రెండ్' చిత్రంతో మరో హిట్ దక్కిందా? ఈ సినిమా ఎలా ఉంది? చూద్దాం రండి.
కథ: భూమా (రష్మిక మందన) ఎం.ఎ లిటరేచర్‌ను పూర్తిచేయడానికి సొంత ఊరు నుండి హైదరాబాద్‌కు వచ్చి ఓ పీజీ కాలేజీలో జాయిన్ అవుతుంది. అదే కాలేజీలో విక్రమ్ (దీక్షిత్ శెట్టి) కూడా పీజీ చేస్తుంటాడు. భూమా చేసిన ఓ చిన్న యాక్సిడెంట్ కారణంగా విక్రమ్‌తో పరిచయం కలుగుతుంది. తొలి పరిచయంలోనే ఒకరికొకరు నచ్చేస్తారు. విక్రమ్‌ని దుర్గ ( అను ఇమ్మాన్యుయేల్) కూడా ప్రేమిస్తుంది. అయితే ఆమెది వన్‌సైడ్ ప్రేమ మాత్రమే. విక్రమ్ తనలో వాళ్ల అమ్మ ప్రేమ చూసుకుంటున్నాడని తెలుసుకున్న భూమ కూడా విక్రమ్‌ను ఇష్టపడుతుంది. ఇలా చదువుకుంటూ ప్రేమించుకుంటున్న వీళ్ల ప్రేమ ప్రయాణంలో, కొన్ని హద్దులు కూడా దాటాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే కొన్ని అనుకొని పరిణామాలు వల్ల విక్రమ్, భూమ మధ్య మనస్పర్థలు వస్తాయి. అసలు ఈ ఇద్దరి మధ్య విభేదాలు రావడానికి కారణమేమిటి? ఇద్దరూ విడిపోవాలని అనుకోవడానికి రీజన్ ఏమిటి? ఆ తరువాత ఏం జరిగింది? అనేది కథ.
Latest News