|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 04:21 PM
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 'పెద్ది' సినిమాలోని 'చికిరి చికిరి' పాట అనతి కాలంలోనే భారీ విజయాన్ని అందుకుంది. ఈ పాట తెలుగు వెర్షన్ యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్, ఐదు భాషల్లో కలిపి 150 మిలియన్ వ్యూస్ సాధించింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ పాటకు మోహిత్ చౌహాన్ గాత్రం అందించారు. గ్రామీణ నేపథ్యంతో కూడిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు.
Latest News