|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 12:59 PM
బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ 'ధురంధర్' చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ నెల 5న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రూ. 350 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, బాలీవుడ్‌లో 'పుష్ప 2' పేరిట ఉన్న కొన్ని రికార్డులను సైతం అధిగమించింది. గత కొన్నాళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న రణవీర్‌కు ఈ సినిమా కెరీర్‌లో పెద్ద రిలీఫ్ ఇచ్చింది. మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం, బాలీవుడ్‌కు ఈ ఏడాది చివర్లో వచ్చిన ఒక సర్‌ప్రైజ్ హిట్‌గా నిలిచింది.
Latest News