|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 10:35 AM
నటి మెహరీన్ పిర్జాదా తన పెళ్లి అంటూ ఒక మీడియా సంస్థ రాసిన కథనంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా ఇలాంటి వార్తలపై మౌనంగా ఉన్నప్పటికీ, ఇప్పుడు స్పందించక తప్పడం లేదని ఆమె తెలిపారు. తనకు పరిచయం కూడా లేని వ్యక్తిని తాను పెళ్లి చేసుకున్నట్లు వార్తలు రాశారని, తాను ఎవరినీ వివాహం చేసుకోలేదని, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు ప్రపంచానికి తప్పక చెబుతానని ఆమె పేర్కొన్నారు. తన పెళ్లి గురించి వదంతులు వ్యాప్తి చేయవద్దని ఆమె కోరారు.
Latest News