|
|
by Suryaa Desk | Tue, Feb 03, 2026, 06:36 PM
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ పురపాలక సంఘం ఎన్నికల బరిలో నిలిచే బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితాను నియోజకవర్గ ఇంచార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు అధికారికంగా ప్రకటించారు. 28 వార్డులకు సంబంధించిన అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన అనంతరం, పార్టీ ముఖ్య నాయకులు మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి ఎన్నికల అధికారులకు బీ-ఫారాలను అందజేశారు. మున్సిపల్ ఎలక్షన్ కోఆర్డినేటర్ గూడూరి ప్రవీణ్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు పొలాస నరేందర్, రామతీర్థపు రాజు, మారం కుమార్, సిరిగిరి రామచంద్రం, అఖిలేష్ కలిసి ఈ ఫారాలను సమర్పించారు. వార్డుల వారీగా పక్కా వ్యూహంతో సమర్థులైన అభ్యర్థులను బరిలోకి దించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. బీ-ఫారాల సమర్పణతో వేములవాడలో ఎన్నికల సందడి పెరిగింది.