|
|
by Suryaa Desk | Tue, Jul 01, 2025, 02:27 PM
హీరో రామ్ పోతినేని ప్రస్తుతం రాజమండ్రిలో జరుగుతున్న "ఆంధ్రా కింగ్" షూటింగ్ లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. అందుకోసం రామ్ రాజమండ్రిలోని ఓ హోటల్‌లో బస చేస్తున్నారు. సోమవారం రాత్రి ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మాస్టర్ కీతో రామ్ వీఐపీ సూట్‌లోకి ప్రవేశించారు. రామ్ మరో బెడ్‌రూమ్‌లో తలుపు వేసుకొని నిద్రిస్తున్నందున ప్రమాదం తప్పింది. దుండగులు తలుపు తన్నడంతో మేల్కొన్న రామ్ వెంటనే సెక్యూరిటీకి సమాచారం ఇచ్చాడు. వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
Latest News