|
|
by Suryaa Desk | Mon, Jun 30, 2025, 07:30 PM
నటి షఫాలీ జరివాలా(42)మృతికి యాంటీ ఏజింగ్ చికిత్స కారణమని వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో విచారణలో భాగంగా నటి ఇంటిని తనిఖీ చేసిన పోలీసులకు రెండు బాక్సుల యాంటీ ఏజింగ్, స్కిన్ గ్లో టాబ్లెట్స్ సోమవారం లభించాయి. ఆమె గత కొన్ని రోజులుగా వాటిని వాడుతున్నట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దీనిపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. పోస్ట్‌మార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు.
Latest News