|
|
by Suryaa Desk | Mon, Jun 30, 2025, 04:23 PM
విపిన్ దర్శకత్వంలో టాలీవుడ్ యువ నటుడు నరేష్ అగస్త్య తన రాబోయే ప్రాజెక్టును చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'మేఘాలు చెప్పిన ప్రేమ కథ' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమాలో రబీయా ఖాటూన్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమాలోని గల గల సాంగ్ ని విడుదల చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. జస్టిన్ ప్రభాకరన్ కంపోస్ చేసిన ఈ సాంగ్ కి రెహమాన్ లిరిక్స్ అందించగా, కార్తీక్ మరియు చిన్మయి తమ గాత్రాలని అందించారు. రాధికా శరత్ కుమార్, విరాజిత, తులసి, సుమన్, తనికెళ్ల భరణి, ఆమనీ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మోహనా కృష్ణ సినిమాటోగ్రఫీ మరియు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం ఉన్నాయి. సునేత్ర ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ కింద ఉమా దేవి కోటా ఈ సినిమాని నిర్మించారు. జస్టిన్ ప్రభాకరన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం జులై 17న విడుదల కానుంది.
Latest News