|
|
by Suryaa Desk | Mon, Jun 30, 2025, 03:27 PM
మంచు విష్ణు కలల ప్రాజెక్టు ‘కన్నప్ప’ విడుదలకు ముందు నుంచే పైరసీ భూతం వెంటాడుతుంది. శుక్రవారం థియేటర్లలోకి వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా పైరసీ విషయంలో ఆవేదన వ్యక్తం చేస్తూ విష్ణు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ‘కన్నప్ప పైరసీ విషయంలో ఎంతో బాధగా ఉంది. ఇప్పటికే 30వేల లింక్‌లు తొలగించాం. పైరసీ అంటేనే దొంగతనం. పైరసీ కంటెంట్ చూడకండి.. సినిమాను సరైన మార్గంలో సపోర్ట్ చేయండి’ అని పోస్ట్ చేశారు.
Latest News